కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు.? కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక ఆయనకున్న లెక్కలు ఏంటి..? నిజంగానే గంప గోవర్ధన్ రిక్వెస్ట్ తోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారా..? లేక మరేదైనా కారణం ఉందా..? ఇప్పుడివే అంశాలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనక రాజకీయ ప్రయోజనం ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. రానున్న ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ నిర్ణయం వెనక కూడా ఏదో వ్యూహం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని ఆరాటపడుతోన్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం లాంచానమే. ఈ ఎన్నికల నాటికీ కేటీఆర్ కు సీఎంగా అవకాశం ఇచ్చి.. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రీజైన్ చేయనున్నారు.
కేసీఆర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ ఎన్నికను లోక్ సభ ఎన్నికలతోపాటే నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. దాంతో తను పోటీ చేసిన కామారెడ్డి అసెంబ్లీకి కవితను కేసీఆర్ పోటీలో నిలపనున్నారని టాక్ నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా కేసీఆరే పోటీలో ఉండనున్నారని ఈ దూరదృష్టితోనే కేసీఆర్ కూతురు కోసం కామారెడ్డిని ఎంపిక చేసుకొని ఉండొచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Also Read : కేసీఆర్ ను తలదన్నేలా పట్నం మహేందర్ రెడ్డి వ్యూహం..!?