అక్టోబర్ చివరి వారం లేదా, నవంబర్ మొదటి వారంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భావిస్తోన్న కేసీఆర్.. పార్టీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయ్యారు. మంచి ముహూర్తం చూసుకొని అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు ఈమేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ నెల 17నుంచి శ్రావణం మాసం ప్రారంభం అవుతుంది. 18న శ్రావణ శుక్రవారం కావడంతో అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్ లను బలంగా విశ్వసించే కేసీఆర్… శ్రావణ మాసంలో అభ్యర్థుల జాబితాను వెల్లడించాలని మొదటే భావించారు. కానీ ఏ తేదీన ప్రకటించాలనే విషయంలోనే ఆలోచిస్తున్నారు.
మొదటి జాబితాలో 80మంది పేర్లను ప్రకటిస్తారని అనుకున్నా…105పేర్లను ఫస్ట్ లిస్టులో ఉంచేలా జాబితాను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ 105పేర్లను ప్రకటించకుంటే కేసీఆర్ లక్కీ నెంబర్ 6వచ్చేలా అభ్యర్థుల జాబితా ఉండొచ్చు. ఇక, 40మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలడంతో.. అందులో 20మందిని సిట్టింగ్ లకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం.
పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు టికెట్ పై కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. వనమా వెంకటేశ్వర్ రావుకు మాత్రం మొండిచేయి చూపారని సమాచారం.
Also Read : తెలంగాణలో అధికారం ఎవరిదీ..? వెల్లడి అయిన సర్వే ఫలితం..!