ఎన్నికలు వస్తున్నాయంటే చాలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్ల వర్షం కురిసేలా పథకాల రూపకల్పన చేస్తారు. ఓటర్ల మనస్సు దోచే పథకాలను ప్రకటించి, ఫలితం రాబడుతారు. అది ఉప ఎన్నిక అయినా, సాధారణ ఎన్నిక అయినా కేసీఆర్ పథకాలతో మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా ప్రకటించేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల జాతర ఉండబోతుందని స్పష్టత ఇచ్చారు కేసీఆర్
2018లో ముందస్తుకు వెళ్లే సమయంలో రైతు బంధును ప్రకటించి గంపగుత్తగా రైతుల ఓట్లను ఖాతాలో వేసుకున్నారు. అప్పటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ ఇప్పుడు మెల్ల, మెల్లగా అమలు చేస్తూ వ్యతిరేకతను తుడిచేసుకుంటున్నారు. అంతేకాదు కొత్తగా, సరికొత్తగా హామీలను ఇవ్వాలనే భావనలో కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పై మునుపటి కంటే ఎక్కువ వ్యతిరేకత ఉందని గ్రహించిన కేసీఆర్..కొత్త పథకాల ప్రకటన లేకపోతే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి దూరం అవుతుందని ఆందోళనతో ఉన్నారు. గత ఎన్నికలకు మించి హామీలను ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు అసెంబ్లీలో చేసిన ప్రకటనతో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. అయితే, అందులో ఏయే హామీలను పొందుపరుస్తారు..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
రైతులకు ఫించన్ ఇవ్వాలనే ప్రతిపాదన బీఆర్ఎస్ బాస్ మనస్సులో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఎన్నికల సమయనా ఈ ప్రతిపాదనపై చర్చ జరిపి ఆచరణలోకి తీసుకురానున్నారా..? అనే చర్చ కేసీఆర్ అసెంబ్లీ ప్రకటనతో ప్రారంభమైంది.
Also Read : మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..?