తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటి, సోషల్ యాక్టివిస్ట్ రేణు దేశాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదేదో రాజకీయం చేసేందుకు కాదు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె కోర్టు మెట్లను ఎక్కారు.
హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పార్క్ తోపాటు పక్షిశాల ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనినే రేణు దేశాయ్ వ్యతిరేకిస్తున్నారు. ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృతిమ సరస్సును ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది కాదని..వెంటనే పనులను నిలిపి వేయాలంటూ కోరారు.
డైరెక్టర్ శశికిరణ్ తిక్కా,నటి శ్రీదివ్య,హీరోయిన్ సదా తోపాటు మరికొంతమందితో కలిసి రేణు దేశాయ్ జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం…ఇలాంటి నిర్మాణాలు సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో జరిగాయి.
ఇండియాలో చేస్తే అభ్యంతరం ఏంటని చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారామ్ జి లతో కూడిన ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.మరి రేణు దేశాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
Also Read నాతో పిల్లల్ని కను పవన్ – శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు