గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ పంపిన ఆర్టీసీ విలీనం బిల్లు పరిశీలన అనంతరం తమిళిసై సౌందరరాజన్ ఆ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. అందులో ఐదు అంశాలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను ఇవ్వాలని అందులో ప్రస్తావించారు.
ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు బిల్లులో ఎందుకు లేవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా?, ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు..?విభజన చట్టం ప్రకారం ఆర్టీసీని మార్చడంపై సమగ్రమైన సమాచారం ఈ బిల్లులో ఎందుకు లేదు..? అని ఈ అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్.
తను కోరిన వివరణ ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉంటె వెంటనే బిల్లును ఆమోదిస్తానని…ప్రభుత్వం తొందగారా వివరణ ఇవ్వాలని తెలిపారు గవర్నర్. మరోవైపు..గవర్నర్ కు వివరణ ఇచ్చే అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీలైనంత తొందరగా ఆమె అభ్యంతరాలపై సంతృప్తికరమైన వివరణ ఇస్తే ఈ బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు..బిల్లును గవర్నర్ తిప్పి పంపడంతో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం పోడగిస్తుందా..?అనే చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై గవర్నర్ సందేహాలను నివృత్తి చేసి బిల్లును ఆమోదించుకునేలా సభ సమావేశాలు పొడగింపు ఉంటుందేమో చూడాలి.
Also Read : ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో బిగ్ ట్విస్ట్..!!