బీఆర్ఎస్ పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలోనే వస్తుందని పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని మరీ,మరీ చెబుతున్నారు. నిర్దిష్టమైన సమాచారం ఉండటంతోనే ఎన్నికల అలర్ట్ ను పార్టీ నేతలకు కేటీఆర్ ఇస్తున్నారా..? అనేది క్లారిటీ లేదు కానీ, ఈ విషయాన్ని నొక్కి మరీ చెబుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
కేటీఆర్ దాదాపు కొంతమంది సిట్టింగ్ లకు టికెట్ మీకేనని అభయం ఇచ్చారు. వారితో విడివిడిగా మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచిస్తున్నారు. టికెట్ ఇవ్వొద్దని భావించిన నేతలతో కేటీఆర్ దూరం, దూరంగానే ఉంటున్నారు. దాంతో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల ఎంపిక పూర్తైనట్లు స్పష్టత వస్తోంది. కాకపోతే రెండు నెలల ముందుగానే ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలను కేటీఆర్ అలర్ట్ చేయడమే ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరగడంతో 2024 జనవరి వరకు తెలంగాణ అసెంబ్లీకి గడువు ఉంది. కాని కేటీఆర్ మాత్రం అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. అయితే, ఎన్నికల సంఘానికి ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ గడువు ముగిసే ఆరు నెలల ముందుగా ఎప్పుడైనా ఎన్నికలు జరిపే అధికారం ఉంటుంది. కాని ఈసీ ఇలా గతంలో ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. అయినా కేటీఆర్ అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తోంది.
Also Read : రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ గాలం – గ్రేటర్ లోని ఆ సీట్ ఆఫర్..?