ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆర్టీసీ బిల్లు మనీ బిల్లు కావడంతో బిల్లు డ్రాఫ్ట్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది తెలంగాణ కేబినెట్. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ ఎలాంటి కొర్రీలు పెట్టారని అంచనా వేసి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే పెట్టుకున్నారు.
గవర్నర్ మాత్రం బిల్లును ఆమోదించలేదు. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే తనకు సమయం పడుతుందని చెప్పకనే చెప్పారు. తొందరగా ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఆర్టీసీ ఉద్యోగుల మన్ననలు పొందాలని బీఆర్ఎస్ భావిస్తే గవర్నర్ బ్రేకులు వేశారు. మరి అసెంబ్లీ సమావేశాలను గడువును పెంచుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టీసీ విలీనం అనేది చిక్కుముళ్ళతో ఉంటుంది. ఆర్టీసీలో కేంద్రానికి కూడా వాటా ఉంటుంది. అందుకే ఈ విషయంలో కొర్రీలు పెట్టేందుకు గవర్నర్ కు ఛాన్స్ ఉంది. దాంతో బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తాము ఆర్టీసీ విలీనం కోసం సిద్దంగానే ఉన్నా…గవర్నర్ మాత్రం అడ్డుకుంటున్నారని చెప్పేలా కార్యక్రమాలు చేపడుతోంది.
ఆర్టీసీ కార్మికులను రాజ్ భవన్ వైపు మల్లిస్తోంది. శనివారం ఛలో రాజ్ భవన్ కు బీఆర్ఎస్ అనుకూల కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాజ్ భవన్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తామని చెబుతున్నారు.
Also Read : రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ గాలం – గ్రేటర్ లోని ఆ సీట్ ఆఫర్..?