ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ఫ్గిలిం చాంబర్ అద్యక్షుడిగా ఎన్నికైన ఆయన రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని వ్యాఖ్యానించడంతో దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారనే చర్చకు బలం చేకూరింది.
గత కొన్నాళ్ళుగా రాజకీయ ఎంట్రీపై డైలమాలో ఉన్నారు దిల్ రాజు. అధికార బీఆర్ఎస్ , ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో దిల్ రాజుకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ లో ఆయన సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దాంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి కానీ దిల్ రాజు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే తాను పోటీగా పోటీ చేస్తే గెలిచి తీరుతాననడంతో ఏ పార్టీ నుంచి దిల్ రాజు పోటీలో ఉంటారనే చర్చ ఊపందుకుంది.
నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో కవిత పోటీ చేయడం ఖాయం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవడంతో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేలా కవిత కూడా లోక్ సభకే పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతో ఆయనకు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఉండటంతో ఎంపీ టికెట్ పై దిల్ రాజు హామీ కోరినట్లు తెలుస్తోంది.
తనకు ఎంపీ సీటు ఇస్తానంటే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నానని దిల్ రాజు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైతే స్పష్టమైన హామీ ఇవ్వలేదు కానీ పార్టీలో చేరాలని దిల్ రాజును ఆహ్వానించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి దిల్ రాజ్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయో..
Also Read : బీజేపీలోకి కొండా కపుల్స్..?