కేసీఆర్ రాజకీయం డిఫరెంట్ గా ఉంటుంది. విమర్శల జడివాన కురుసిన తరువాత దానిని తనకు అనుకూల వాతావరణంగా మార్చుకోవడంలో కేసీఆర్ సిద్దహస్తులు. ఏదైనా ఆపద వస్తే వెంటనే సాయం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని అనుకుంటారో ఏమో కానీ ప్రతిపక్షాలు నోటికి పని చెప్పేవరకు ఆయన కాలుకదపరు. నోరు మెదపరు. అందరూ అలసిపోయిన తరువాత ఒకే ఒక్క నిర్ణయంతో బాధితులను కూడా బుట్టలో వేసుకుంటారు కేసీఆర్. వేనోళ్ళ తిట్టినళ్ళతోనే పొగిడించుకునేలా కేసీఆర్ రాజకీయ శైలి ఉంటుంది.
కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో నష్టపరిహారం ప్రకటించి… నష్టాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కేసీఆర్. వరదలోస్తే కేసీఆర్ సమీక్షలతోనే కాలం గడుపుతున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. గతంలో వరదలోస్తే కుటుంబానికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇచ్చి అందర్నీ అనుకూలంగా మార్చుకున్నారు. చాలామందికి సహాయం దక్కలేదు కానీ సహాయం చేశారన్న భావన మాత్రం జనాల్లో ఉంటుంది కదా అదే కేసీఆర్ కు కలిసి వస్తుంది.
ఇటీవలి వర్షాలకు ఉమ్మడి వరంగల్ దాదాపు వరదల్లో చిక్కుంది. పలు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ప్రాణ నష్టం జరిగింది. మూగ జంతువులు మృత్యువాత పడ్డాయి. లక్షల కోట్లలో నష్టం జరిగింది. అయినా సర్కార్ మేల్కొనడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఎవరూ ఊహించలేనంత పరిహారం ప్రకటిస్తారన్న స్పెక్యూలేషన్స్ వస్తున్నాయి.
ఈ ఒక్క పని చేస్తే ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పై వచ్చిన ఆరోపణలు, విమర్శలు పరిహారం అందజేతలో కొట్టుకుపోతాయని కేసీఆర్ నమ్ముతున్నారు. కానీ ఈ సారి సర్కార్ సాయం చేసినా బెడిసికొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read : వరదలతో జనం అల్లాడిపోతున్నా కేసీఆర్ తీరు మాత్రం అంతేనా..?