ఇటీవలి వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇంకా కాలనీలు, గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని… పరిస్థితిని కేసీఆర్ సమీక్షిస్తున్నారని మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్పితే నిజంగానే ప్రగతి భవన్ లో కేసీఆర్ రివ్యూలు చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లకపోవడంతో ప్రాణ నష్టం జరిగిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. కేంద్ర బృందాలు రంగంలోకి దిగడంతో కొంత మంది ప్రాణాలు బయటపడ్డారనే వాదనలు ఉన్నాయి. సమీక్షలతోనే కేసీఆర్ కాలం వెళ్ళదీశారని ప్రజలకు భరోసా ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు.
ముంపు ప్రాంత ప్రజలంతా కేసీఆర్ తీరుపై, బీఆర్ఎస్ సర్కార్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు. అధికార పార్టీ నేతలు వస్తే బడిత పూజ చేసేలా రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అంచనా వేసిన కేసీఆర్ వరద రాజకీయాన్ని బహు చక్కగా ఉపయోగించుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేబినేట్ భేటీ ఏర్పాటు చేస్తున్నట్లు.. ఎంత ఆర్థిక సాయం చేయాలనే విషయంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తారని లీక్ ఇచ్చారు.
ఎంత చేసినా కేసీఆర్ ను జనం నమ్మేలా మాత్రం లేరు. కానీ వర్తమాన రాజకీయాల్లో అపర రాజకీయ మేధావిగా పేరొందిన కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎలా చక్రం తిప్పుతున్నారో చూడాలి.
Also Read : బీజేపీలోకి కొండా కపుల్స్..?