బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశమయ్యారు. ఉద్యమ సమయంలో తాను చేసిన హామీల వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా లంకలో పుట్టినోళ్లెనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయి.
గతంలో తాను మాట్లాడిన వీడియోలను తొలగించాలని చెప్పినా ఇంకా ఎందుకు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వింగ్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతోపాటు మోడీని పొగిడినట్లు, వాళ్ళతో తనకు స్నేహం ఉన్నట్లు చెప్పిన వీడియోలను వెంటనే డిలీట్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఆ వీడియోలను బ్లాక్ చేసేలా చూడాలని కర్తవ్య బోధన చేశారు.
ప్రతిపక్షాలను కవ్వించేలా వీడియోలు చేయవద్దని సూచించిన కేసీఆర్… ప్రత్యర్ధి పార్టీలు ఇస్తోన్న కౌంటర్లకు కూడా సరైన సమాధానం చేయలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరువు బజారుకీడ్చేలా వీడియోలను సర్క్యూలేట్ చేయవద్దని… పరోక్షంగా కేటీఆర్ రేవంత్ విషయంలో అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. ఈ ఒక్క అంశం బీఆర్ఎస్ కు రైతుల మద్దతును కోల్పోయేలా చేసిందని కేసీఆర్ అన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివ్ గా మారడంతో కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరించిన తీరుపై జనాల్లో చర్చ జరుగుతోంది. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఈ వీడియోలను చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు కేసీఆర్ లో మంచి నటుడు ఉన్నాడని కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు.
Also Read : రేవంత్ ను మాత్రమే బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందా..?