తెలంగాణలో రేవంత్ రెడ్డిని మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా అనుకుంటోంది. ఆయన టార్గెట్ గానే బీఆర్ఎస్ అండ్ కో రాజకీయం చేస్తోంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఒంటరి చేయాలని, సీనియర్ల ముందు దోషిగా నిలపాలని ఎప్పటి నుంచో అనేకానేక ప్రయత్నాలు చేస్తోంది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఆ చిల్లర ప్రయత్నాలే రేవంత్ లో పట్టుదలను పెంచాయి. కేసీఆర్ పై అవిశ్రాంతంగా కొట్లాడేలా పురమాయించాయి. కేసీఆర్ కు ధీటైన నేతగా గుర్తింపు పొందేలా మార్చాయి.
రేవంత్ రూపంలో బీఆర్ఎస్ అధికారానికి ప్రమాదం పొంచి ఉందని గులాబీ పార్టీ గ్రహించింది. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కనిపిస్తోన్న ఊపు, రేవంత్ నాయకత్వ చరిష్మా చూస్తుంటే బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం దక్కదని ప్రగతి భవన్ పెద్దలు టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ లో ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ మాట్లాడినదాన్ని వక్రీకరించి రేవంత్ ను బద్నాం చేసే కుట్ర చేశారు.
రేవంత్ ను బద్నాం చేసింది ఓ సాధారణ బీఆర్ఎస్ కార్యకర్త కాదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్న కేటీఆర్ ప్రత్యర్ధి పార్టీ అద్యక్షుడి వ్యాఖ్యలను వక్రీకరించారంటే ఆయన ఎంత దిగజారిపోయారో, అధికారం చేజారిపోతుందని ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థం అవుతుంది.
విద్యుత్ ఒప్పందంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిపై రేవంత్ మాట్లాడుతున్న వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ ఏది నిజమో, ఏది అబద్దమో బయటపడకమానుతుందా..? నిజం బయటపడింది. ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో , బీఆర్ఎస్ అనుకూల ఛానెల్స్ లో వచ్చిన ప్రసారాలు ఎడిటెడ్ వర్షన్ అని తేలింది.
రేవంత్ ఊరుకుంటాడా..? విద్యుత్ ఒప్పందంలో జరిగిన అవినీతిని బయటపెట్టడమే కాదు… అసలు రాష్ట్రంలో రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేల్చారు. 24గంటల కరెంట్ పై కేటీఆర్ తో సహా మంత్రులంతా ఏకబిగిన రేవంత్ పై సవాళ్ళతో విరుచుకుపడ్డారు. అయినా బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాళ్ళకు రేవంత్, నేను సిద్దమని ప్రతి సవాల్ చేశారు. 24గంటల కరెంట్ ఇవ్వట్లేదని నిరూపించేందుకు నేను రెడీ…ఎక్కడికి వస్తారో చెప్పండని రేవంత్ ప్రతి సవాల్ విసిరితే ఎవరూ చప్పుడు చేయలేదు.
రేవంత్ ను ఉచిత విద్యుత్ పై అడ్డంగా ఇరికించాలని కేటీఆర్ ప్లాన్ వేశారు కానీ అది రివర్స్ అయి కేటీఆర్ కు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే రేవంత్ మాత్రమే టార్గెట్ చేసి…జనాల్లో ఆయన్ను, ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనే బీఆర్ఎస్ కుట్ర చాలా స్పష్టంగా కనబడుతోంది.
Also Read : హరీష్ రావుతో కొత్త పార్టీ దిశగా కేసీఆర్..?