ఇటీవల జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు చేస్తూ సన్నీ లియోన్ ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందంటూ రోజా సెటైర్ వేశారు.
రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సినీనటి అయిన రోజా మరో నటిని చర్చలోకి తీసుకురావడం సరైంది కాదంటూ చర్చ నడిచింది. గతంలో సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా కొనసాగింది. ఆమె ఆ వృత్తిని వదిలేసి చాలా కాలమైంది అయినా ఆమె గతాన్ని పట్టుకొని పవన్ పై సెటైర్లు వేయడం సబబు కాదనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వచ్చాయి.
రాజకీయాల కోసం ఓ మహిళను చర్చలోకి తీసుకొస్తారా..? అని విమర్శలు వచ్చాయి. అయితే, రోజా వ్యాఖ్యలపై సన్నీ లియోన్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సన్నీ లియోన్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దీన్ని జనసేన కార్యకర్తలు షేర్ చేస్తూ రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని పేర్కొంటున్నారు.
జనసేన కార్యకర్తలు షేర్ చేస్తోన్న ఆ ట్వీట్ సన్నీ లియోన్ ది కాదని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆమె అధికారిక ఖాతాను ట్విట్టర్ వెరీఫై చేసింది. ఆమె అకౌంట్ కి బ్లూటిక్ ఉంటుంది. కానీ, జనసేన కార్యకర్తలు షేర్ చేసిన ట్వీట్ కి ఎలాంటి బ్లూ టిక్ లేదు. దీనిని ఎవరో ఎడిట్ చేసి పోస్ట్ చేయడంతో వైరల్ అయినట్లు తెలుస్తోంది.