కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో ముందంజలోకి వచ్చేసింది. పవర్ వార్ లోనూ తగ్గేది లేదని అధికార బీఆర్ఎస్ కు సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ మాత్రం మునుపటి వేవ్ ను అందుకోలేక చతికిలపడింది. ఫలితంగా 24గంటల ఉచిత కరెంట్ పై రేవంత్ ను ఇరికించబోయిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీనే ఇరికించేశాడు. రైతులకు 24 గంటల కరెంట్ బీఆర్ఎస్ ఇవ్వట్లేదనే కాదు, 24గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపించి అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్ సాక్ష్యాలు బయటపెట్టడంతో బీఆర్ఎస్ ప్లాన్ భూమ్ రాంగ్ అయింది.
ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కు ప్రధాన ఓటు బ్యాంక్ గానున్న రైతులు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నారు. దళిత బంధు అందరికీ ఇస్తామని ఎన్నికల వరకు సాగదీసే కుట్ర నడుస్తోంది. గిరిజన బంధు మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు మాత్రమే బీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రమని తేలింది. బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం ఇస్తామని 400కోట్లు విడుదల చేశారు. ఈ పథకానికి నిధుల విడుదల ఇలాగె కొనసాగితే అర్హులందరికీ ఈ సాయం అందాలంటే పుష్కర కాలం పడుతుంది. దీంతో కేసీఆర్ ప్రవేశపడుతోన్న పథకాలు ఆరంభ శూరత్వమేనని స్పష్టం అవుతోంది.
రైతులకు 1లక్ష రుణమాఫీ చేయలేదు. దాంతో రైతులను డీఫాల్టర్లుగా ప్రకటించి రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకర్లు ఇవ్వడంలేదు. దాంతో తెలంగాణ రైతంగామంతా కేసీఆర్ పాలనపై తీవ్ర అగ్రహావేషాలతో రగిలిపోతుంది. కౌలు రైతులను తాము రైతులుగా పరిగణించమని కేసీఆర్ స్పష్టం చేయడం.. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 12వేల ఆర్థిక సాయం కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వారిని టెంప్ట్ చేస్తోంది.
80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022లో ఏప్రిల్ లో ప్రకటించిన కేసీఆర్ కనీసం 30వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దాంతో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ కు ఈసారి గట్టిగా బుద్ది చెప్పాలని విద్యార్ధి, నిరుద్యోగ యువత పట్టుదలతో ఉన్నది. పైగా కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ యువతను అట్రాక్ట్ చేస్తోంది.
అన్ని వర్గాల ప్రజల్లో బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిబింబిస్తే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయం. వీటన్నింటిని అంచనా వేసిన కేసీఆర్ ఇప్పట్లో అన్ని వర్గాలను ఆకట్టుకోనెందుకు నేరుగా నగదు సాయాన్ని చేయాలనుకున్నా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది. అందుకే కేసీఆర్ తన మదిలో అస్త్రలను వెలికి తీస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే హరీష్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేయించడం తప్ప మరో మార్గం లేదని ఆలోచిస్తున్నారట. వ్యూహంలో భాగంగా హరీష్ రావును బయటకు పంపి ఆయనతో కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తారట. ఆయనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాగు నడుస్తారు. ఆ తరువాత ఎన్నికల్లో హరీశ్ రావు పార్టీ పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలి అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు చేస్తుందనేది కేసీఆర్ వ్యూహం. హరీష్ కు అత్యంత సన్నిహితుడు అయిన సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అనే వ్యక్తి.. “టీఆర్ఎస్ ” అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం సీఈసీకి దరఖాస్తు చేసుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది.
హరీష్ రావుతో పార్టీ పెట్టించడం వలన ఇరు పార్టీలకు చెరో 30సీట్లు వచ్చినా మొత్తం 60సీట్లు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వ్యూహంతో కేసీఆర్ ఈ ప్లాన్ కు తెరతీసినట్లు టాక్ నడుస్తోంది. గతంలోనే ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా…కాంగ్రెస్ కు ఆనుకున్న ఆదరణ లేదని వెనక్కి తగ్గారట కేసీఆర్. ఇప్పుడేమో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో కేసీఆర్ ఈ నయా ప్లాన్ ను అమలు చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నారట.