కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవికి ఎంపిక చేశారని ఒక రోజు ముందుగానే Polytricks.in చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. బండి హయాంలో పార్టీ గొప్పగా పుంజుకున్నా ఏకపక్ష నిర్ణయాలు, వ్యక్తిగత ఎదుగుదలకు ఎక్కువ ప్రియార్టి ఇచ్చారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. బండి నేతృత్వంలో తాము పని చేయలేమని, ఆయన్ను తప్పిస్తే సరేసరి. లేదంటే తమ దారి తాము చూసుకుంటామని హైకమాండ్ కు అసంతృప్త నేతలు అల్టిమేటం విధించారు. దీంతో అద్యక్ష మార్పు తప్పనిసరి అయింది.
బండి స్థానంలో అద్యక్ష బాధ్యతలను ఈటల ఆశించారు కానీ ఆయనకు ఇస్తే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ గుర్తించింది. ఈటలకు అద్యక్ష పదవి ఇస్తే పార్టీలో సీన్ మళ్ళీ మొదటికే వస్తోంది కాబట్టి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సీనియర్ నేత కిషన్ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెడుతూ ఆయన్ను కొంత చల్లబరిచే ప్రయత్నం చేశారు.
బండిని అద్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఇకనైనా అసంతృప్తులు సైలెంట్ అవుతారో లేక తమకు ఆశించిన పదవులు దక్కలేదని పెదవి విరుస్తారో చూడాలి. అద్యక్ష మార్పుతో బీజేపీలోని వలస నేతల పార్టీ మార్పు నిర్ణయాన్ని బీజేపీ వాయిదా వేయించే ప్రయత్నం చేసింది. మరి కిషన్ రెడ్డి అయినా పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి పార్టీని గాడిన పెడుతారో లేక బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తారో చూడాలి.
Also Read : టి. బీజేపీ ప్రెసిడెంట్ రేస్ – కిషన్ రెడ్డి, డీకే అరుణల మధ్య పోటీ..?