తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ గురి పెట్టింది. బీఆర్ఎస్ పతనం కేసీఆర్ సొంత జిల్లా నుంచే ప్రారంభిస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలు వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, పటాన్ చెరు, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకోసం కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గతం కంటే మెరుగ్గానే కాంగ్రెస్ గ్రాఫ్ కనిపిస్తోంది. గజ్వేల్ లో బీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు మొగించేలా వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పని చేస్తోంది. అందుకే గ్రౌండ్ లెవల్ సిట్యుయేషన్ ను బట్టి కాకుండా ప్రజాబలం లేని నేతలకు ఆదరణ పెరుగుతోందని బీఆర్ఎస్ అనుకూల పత్రిక రాసుకోస్తోంది. బీఆర్ఎస్ పేపర్ కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా వార్త ప్రచురించిందంటేనే సీన్ అర్థం చేసుకోవచ్చు. బలహీన అభ్యర్థులకు లేని బలాన్ని క్రియేట్ చేస్తూ తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఫలితంగా మెదక్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.
ఈ క్రమంలోనే ఎస్కే టీమ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు..? ఎవరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయి…? ఆర్థికపరమైన బలాలు..?అనే అంశాలపై సర్వే చేసింది. ఈ నివేదికను ఎస్కే టీమ్ వడపోసి తుది నివేదిక తయారు చేసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఎస్కే టీమ్ మెదక్ జిల్లాలో ప్రజా బలం మెండుగా ఉన్న నేతల్లో ఎవరెవరిని గుర్తించిందో చూద్దాం.
నర్సాపూర్ : గాలి అనిల్ కుమార్ , ఆంజనేయులు గౌడ్ , ఆవుల రాజిరెడ్డి
పటాన్ చెరు : గాలి అనిల్ కుమార్ లేదా కాట శ్రీనివాస్
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతున్న గాలి అనిల్ పేరును రెండు నియోజకవర్గాల కోసం ఎస్కే టీమ్ పరిశీలిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గాలి అనిల్ కు టికెట్ కేటాయించే అవకాశం మెండుగా ఉందని సమాచారం.
గజ్వేల్ : తూంకుంట నర్సారెడ్డి
సిద్ధిపేట : రఘువర్ధన్ రెడ్డి, హరికృష్ణ పూజల
మెదక్ : శశిధర్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
సంగారెడ్డి : జగ్గారెడ్డి
దుబ్బాక : చెరుకు శ్రీనివాస్ రెడ్డి,శ్రావణ్ కుమార్ రెడ్డి
జహీరాబాద్ : గీతారెడ్డి
ఆందోల్ : దామోదర రాజనర్సింహ
Also Read : ఏఐసీసీకి అందిన ఎస్కే టీమ్ నివేదిక – ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?