వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అయిన వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు..? ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల అక్కడి నుంచి బరిలో నిలుస్తారా..? లేక గెలుపు స్థానం మరొకటని తలిచి మరో సెగ్మెంట్ పై గురి పెట్టారా..? అనే చర్చ జరుగుతోన్న వేళ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రిపోర్ట్ షర్మిల పోటీపై స్పష్టతనిచ్చినట్లు కనిపిస్తోంది.
వైఎస్ షర్మిల తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయాలనుకుంటుంది. ఏపీకి వెళ్లాలని హైకమాండ్ పట్టుబడుతున్న ఆమె మాత్రం ససేమీరా అంటోంది. తాను తెలంగాణను వీడేది లేదని తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొడుతోంది. షర్మిల పట్టువీడకపోవడంతో హైకమాండ్ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఆమెకు సర్దిచెప్పి ఏపీకి పంపించవచ్చు ప్రస్తుతానికి తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేసిన పరవాలేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ ఏపీ వాసులతో సత్సంబంధాలు ఉన్న వారు చాలామంది ఉన్నారు. దీనిని పసిగట్టి సర్వేలు చేయించిన షర్మిల తన గెలుపు స్థానం పాలేరేనని తేల్చారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారడంతో వైఎస్సార్ టీపీని విలీనం చేయనున్న షర్మిల గ్రేటర్ పరిధి నుంచి పోటీలో నిలిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచిస్తుందట.
సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే కూడా విజయావకాశాలు ఉంటాయని షర్మిల భావిస్తున్నారట. ఎస్కే టీమ్ చేసిన సర్వేలోనూ ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఉన్నాయని తేల్చింది. గ్రేటర్ పరిధిలో విజయం కోసం ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోన్న ఎస్కే టీమ్ షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీలో నిలపాలని సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : వైఎస్సార్ కు నటితో రెండో పెళ్లి – సోషల్ మీడియాను ఊపేస్తోన్న వార్త..!!