బీజేపీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది. బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్న రాజగోపాల్ రెడ్డి…సొంత గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాజగోపాల్ రెడ్డి చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేపోమాపో ఆయన కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన చేసేందుకు రెడీ అయ్యారు.
కాంగ్రెస్ లో చేరడంపై సన్నిహితులకు రాజగోపాల్ రెడ్డి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. క్యాడర్ ను కూడా అందుకు సంసిద్దులని చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు తన సోదరుడు వెంకట్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. రాజగోపాల్ చేరికపై రేవంత్ తో కూడా వెంకట్ రెడ్డి చర్చించారని.. అందుకు రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఆయన చేరికకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
అయితే.. రాజగోపాల్ రెడ్డితోపాటు ఎవరెవరు కాంగ్రెస్ లో చేరుతారు..? ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డితో సన్నిహితంగా మెదిలిన ఈటల కూడా రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం వెలువరిస్తారా..? మరికొద్ది రోజులు వేచి చూస్తారా..?అనేది పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంట రేపుతోంది.
Also Read : కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?