వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. భారత్ వేదికగా అక్టోబర్ – నవంబర్ మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ తో వరల్డ్ కప్ సంగ్రామం మొదలు కానుంది.
ఆతిథ్య భారత జట్టు లీగ్ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మ్యాచ్ లో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్ధి పాక్ తో మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15,16 తేదీలలో ముంబై, కోల్ కత్తా వేదికగా సెమి ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
హైదరాబాద్ మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్ తమకు రెండు వేదికలు అనుకూలంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేయగా… ఐసీసీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా షెడ్యూల్ ను విడుదల చేసింది.
టీమిండియా షెడ్యూల్
అక్టోబర్ 8 -ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్ 11 – ఆఫ్ఘానిస్తాన్ తో (ఢిల్లీ)
అక్టోబర్ 15-పాకిస్తాన్ తో (అహ్మదాబాద్ )
అక్టోబర్ 19 -బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22-న్యూజిలాండ్ తో(ధర్మశాల )
అక్టోబర్ 29 -ఇంగ్లాండ్ తో(లక్నో)
నవంబర్ 2 -క్వాలిఫయర్ 2 తో(ముంబై)
నవంబర్ 5-దక్షిణాఫ్రికా తో (కోల్ కత్తా)
నవంబర్ 11 -క్వాలిఫయర్ 1 తో (బెంగళూరు)