ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న జనసేనాని వ్యూహత్మక రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కుదిరితే బీజేపీని కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేయాలనేది పవన్ స్ట్రాటజీ. మరోవైపు జగన్ మాత్రం 175కు 175స్థానాల్లో ఈసారి గెలుపు మాదేనని ధీమాగా చెబుతున్నారు.
వైసీపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలంటే జగన్ ను ఓడించాలనేది పవన్ స్కెచ్. ఇందుకోసం ఎం చేయాలన్న దానిపై ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. జనసేనకు రాయలసీమలోనూ మంచి ఆదరణ ఉంది. గతంలో చిరంజీవి పీఆర్పీ తరుఫున పోటీ చేయగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తాను కూడా రాయలసీమ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది..? అని పవన్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది .
రాయలసీమ నుంచి తిరుపతి, నగరి స్థానాలు పవన్ పరిశీలనలో ఉన్నాయని…అవసరమైతే పులివెందుల నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని పవన్ చెప్పినట్లు సమాచారం. జగన్ పై పోటీ చేస్తే రాయలసీమవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని తద్వారా సీమలో టీడీపీ – జనసేన కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని పవన్ లెక్కలు కడుతున్నారని జనసేన నేతల్లో చర్చ జరుగుతోంది.
అయితే.. పులివెందులలో సర్వే చేసి ఆ తరువాత పరిణామాలను బట్టి పవన్ పోటీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి పులివెందుల నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని పవన్ తన సన్నిహితులతో పెర్కొనడటం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..!!
Also Read : కేసీఆర్ వ్యాఖ్యలనే చంద్రబాబు పలికారు – కానీ ఆ పత్రికకు నచ్చలేదట..!?