గత ఎన్నికల సమయంలో జగన్ కు మైలేజ్ పెంచేందుకు సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అదే చేస్తున్నాడు. వ్యూహం అనే టైటిల్ తో సినిమా రూపొందించాడు. ఇందుకు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు వర్మ. పెద్దగా హడావిడి, వివాదాస్పద అంశాలను కనిపించకుండా టీజర్ విడుదల చేశాడు వర్మ.
హెలీకాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన సీన్ తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. అనంతరం రోశయ్య ఎంట్రీ, జగన్ పై కాంగ్రెస్ సీబీఐ ఎంక్వైరీ , అరెస్ట్ చేయడం వంటివి చూపిస్తూ టీజర్ ను చూపించారు. అయితే టీజర్ లో అన్ని తెలిసిన అంశాలే ఉన్నాయి. కొత్తగా వర్మ చూపించినదేమి లేదు. కేవలం జరిగిన వాటిని కొంత ఆసక్తిగా చూపించినట్లు చూపించారు.
“వ్యూహం”ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. దాంతో మొదటి పార్ట్ లో జనసేన ప్రస్తావన ఉండదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మరణం నాటికి జనసేన ఆవిర్భావించలేదు. ప్రజారాజ్యం మాత్రమే ఉన్నది. కానీ పీఆర్పీ గురించి కూడా టీజర్ లో చూపించలేదు. ఎందుకంటే జగన్ తో చిరంజీవి సన్నిహితంగానే ఉంటున్నారు. అందుకే కావొచ్చు చిరుకు వ్యతిరేక సన్నివేశాలను చూపించలేదు.
జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు..? అనే అంశాలను సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. సెకండ్ పార్ట్ లో పవన్ గురించి సన్నివేశాలు ఉంటాయి. పూర్తిగా వైసీపీకి అనుకూలంగా , జనసేనకు వ్యతిరేకంగా సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉంది.