ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ నేతల్లో అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే పొంగులేటి ‘రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ’ కి ఏపీలో వేల కోట్ల కాంట్రాక్ట్ లను కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. ఎలాంటి లాభం ఆశించకుండా కోట్ల కాంట్రాక్ట్ లను పొంగులేటికి అప్పగించే అవకాశం లేదు. ఆయనతో రాజకీయంగా పనులు చేయించుకునే ఆలోచనతో జగన్ కాంట్రాక్ట్ లను కట్టబెట్టి ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం.
ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆయన జగన్ తో పలుమార్లు సమావేశమయ్యారు. ఆ తరువాతే ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ లో చేరడమే మేలని పొంగులేటికి జగన్ సూచించి ఉంటారని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడి చేరికను పొంగులేటి కన్ఫాం చేసుకున్నారు. వచ్చే నెల ఆయన ఖమ్మంలో సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరనున్నారు.
జగన్ కు బీజేపీ అండదండలు ఉన్నాయి. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. కానీ జగన్ సన్నిహితుడిని మాత్రం బీజేపీలోకి వెళ్ళమని చెప్పకుండా కాంగ్రెస్ లో చేరమని జగన్ సలహా ఇవ్వడం వెనక రాజకీయ ప్రయోజనం ఉండొచ్చుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్ లో కాంగ్రెస్ తో అవసరం ఏర్పడితే పొంగులేటి ద్వారా పనులు చక్కబెట్టుకోవచ్చుననేది జగన్ ఆలోచన కావొచ్చు. అందుకే పొంగులేటికి కాంగ్రెస్ ను జగన్ చూస్ చేసి ఉండొచ్చు.
Also Read : ఇడుపులపాయకు సోనియా, రాహుల్ గాంధీలు – అక్కడే కీలక ప్రకటన