ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై కేసు నమోదైంది. బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు నిజమేనని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిపూర్ణనంద స్వామి జైలులో ఉన్నారు. ఈ కేసును దిశ పోలీసు విభాగం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ చేపట్టారు. బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేల్చిన పోలీసులు… ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు. బాలికను పూర్ణానందస్వామి అర్దరాత్రి నిద్రలేపి గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్లు చెప్పారు. మరో బాలికతోనూ ఇలాగె ప్రవర్తించడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బాలిక కుటుంబీకులకు తెలియడంతో బాలికను ఇంటికి తీసుకెళ్ళారు.
కానీ విషయం బయటకు రాకుండా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. ఇక మరో బాలిక స్వామి ఆగడాలను భరించలేక ఆశ్రమం నుంచి తప్పించుకొని బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. మొత్తంగా ఇద్దరు బాలికలపై స్వామి అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
Also Read : హైదరాబాద్ లో విస్తరిస్తోన్న కాల్ బాయ్స్ సేవలు