హిందూపురంలో పోటీకి వైసీపీ కొత్త నేతను తయారుచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీకి ఎవరికీ తెలియని నేతను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంచర్జులతో గడప, గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూపురం వైసీపీ ఇంచార్జ్ గా నున్న ఇక్బాల్ కు ఆహ్వానం అందలేదు. దీపిక అనే నాయకురాలిని ఆహ్వానించారు.
ఈ సమీక్ష సమావేశానికి దీపికను ఆహ్వానించడం వెనక హిందూపురంలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకునని అంటున్నారు. ఎందుకంటే హిందూపురం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ది ఒక వర్గం. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ది మరో వర్గం. గ్రూప్ రాజకీయాలతో హిందూపురంలో వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
ఓ వైసీపీ నేత హత్యలో ఇక్బాల్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయం జగన్ తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్బాల్ ను కాదని వైరి వర్గానికి టికెట్ ఇస్తే ఆయన నొచ్చుకుంటారు. కానీ మరో వర్గానికి టికెట్ ఇస్తే ఇక్బాల్ నొచ్చుకుంటారు. అందుకే మద్యే మార్గంగా ఉండేందుకుఎవరి గ్రూపు లేని దీపికను ఎంపిక చేశారని అంటున్నారు. ఈమెకు జిల్లా ఇంచార్జ్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉన్నట్టు వినికిడి.