కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేలా రేవంత్ ఓవైపు పావులు కదుపుతుంటే…మరోవైపు కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్దం చేశారు. కర్ణాటక ఎన్నికల తరువాత పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారడంతో బీఆర్ఎస్ – బీజేపీ నుంచి హస్తం పార్టీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ ను తిరిగి దెబ్బకొట్టే దిశగా కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రణాళికలు సిద్దం చేశారు. ఈమేరకు టీపీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతిని బీఆర్ఎస్ లో చేర్చుకునేలా కేసీఆర్ తెర వెనక మంత్రాంగం నడిపిస్తున్నారు.
ఉత్తమ్ చేరికను కేసీఆర్ ఎప్పుడో ఫిక్స్ చేశారని సందర్భం బట్టి ఆయన్ను కారెక్కిస్తారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్నాళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికల సమయానికి ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఎన్నికల వేళ ఉత్తమ్ ను బీఆర్ఎస్ లో చేర్చుకొని కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ కు ఫేవర్ గా మారుతుండటంతో ఉత్తమ్ చేరికను ముందుగానే కేసీఆర్ ఫిక్స్ చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న దృష్ట్యా కాంగ్రెస్ ను బలహీనపరచాలంటే ఉత్తమ్ ను ఈ సమయంలో కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు చెబుతున్నారు.
ఓ మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ ఆహ్వానాన్ని ఈ ఇద్దరు నేతలు ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాలను ఉత్తమ్ కు ఆఫర్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే, తాను బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీగా ఉన్నానని కానీ ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతానని.. అదే విధంగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీఆర్ఎస్ కు షరతు విధించినట్లు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్తమ్ రెడీ అయ్యారని…కాంగ్రెస్ లో చేరికల సమయంలోనే అందుకు కౌంటర్ గా ఉత్తమ్ ను పార్టీలో చేర్చుకునేలా బీఆర్ఎస్ వ్యూహం సిద్దం చేస్తోంది.
బీఆర్ఎస్ లో ఉత్తమ్ చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న్నపటికీ ఆయన స్పందించకపోవడం ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?