ఏపీ సీఎంవోలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల ఆధిపత్యపోరు కొట్టుకునే స్థాయికి చేరింది. ఇద్దరు జుట్లు పట్టేసుకొని కొట్టుకున్నారు. నీ బాగోతం నాకు తెలియదా..? అంటూ ఒకరిని ఉద్దేశించి ఒకరు ఆగ్రహంతో తిట్టుకున్నారు. దాడి చేసుకొని పరువు తీసుకున్న జర్నలిస్టులు ఏదో అనామక చానల్ కు చెందిన జర్నలిస్టులు కాదు. పేరుమోసిన ఛానెల్ కు చెందిన ప్రతినిధులు. వారిలో ఒకరు టీవీ9 రిపోర్టర్ హసీనా మరొకరు ఎన్టీవీ రిపోర్టర్ రెహానా.
ఏపీలో ఏదైనా ఇష్యూ జరిగితే సీఎంవోలో ఈ ఇద్దరు జర్నలిస్టులు వెంటనే వాలిపోతారు. సజ్జల ముంగిట కనిపిస్తారు. మా మైక్ ముందుండాలంటే మా మైక్ ముందుండాలని ఆరాటపడుతుంటారు. సజ్జల మెప్పు పొందేందుకు వీళ్ళు చూపించే ఆసక్తి చూసి సహచర జర్నలిస్టులు సైతం నవ్వుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఈ ఇద్దరు అస్సలు పట్టించుకోరు. సజ్జల దృష్టిలో నేనే భేష్ అనిపించుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
సమాజానికి నీతివాక్యలు వల్లించే ఈ చానెల్స్ ప్రతినిధులు ఆధిపత్యపోరుతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. రిపోర్టింగ్ చేసే సమయంలో తోసేస్తావు..గిల్లుతావు అంటూ రేహానాను ఉద్దేశించి ఆరోపిస్తోంది హసీనా. అయితే కొట్టుకొని ఊరుకుంటే ఇదో ప్రచారంగానే ఉండిపోయేది. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసుకొని వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుకొని పరువు తీసుకున్నారు. విషయం చానెల్స్ యాజమాన్యానికి చేరడంతో వారిని అక్కడి నుంచి బదిలీ చేశాయి. రెహానాను వైజాగ్‌కు, హసీనాను హైదరాబాద్‌కు ఆయా ఛానల్స్ బదిలీ చేశాయి.
ప్రస్తుతానికి ఈ ఇద్దరినీ బదిలీ చేశారు కానీ త్వరలోనే వారు మళ్ళీ సీఎంవోలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికున్న సంబంధాలు అలాంటివి మరి. హసీనాకు టీవీ9లో ఎంత ప్రాధాన్యత ఉందో కానీ సజ్జలతోపాటు సీఎం జగన్ సీపీఆర్వో శ్రీహరి వద్ద మాత్రం ప్రాధాన్యత మాత్రం భారీగానే ఉంటుంది. రెహనాకు కూడా అంతే. కాబట్టి త్వరలోనే ఈ ఇద్దరూ మళ్ళీ సీఎంలోకి వస్తారని చెప్తున్నారు.