ట్రాన్స్ యాక్టర్ అండ్ LGBTQIA కార్యకర్త సుశాంత్ దివ్ గికర్ ట్రాన్స్ పర్సన్ గా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ట్రాన్స్ జెండర్ గా ఉండటమంటే సెక్స్ వర్క్ చేయాల్సి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.
పలు హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ లలో పని చేసినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఎంతోమంది వస్తూ, పోతు సూటిపోటి మాటలతో తన హృదయానికి గాయం చేసే వారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు ఇలాంటి నీచమైన సమాజంలో ఉన్నామా..? అని బాధ కల్గేదని వివరించాడు.
తను బాధలో ఉన్నప్పుడు తన తండ్రి తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఓ రోజు నేను బాధ పడుతున్నపుడు మా నాన్న నా చేయి పట్టుకొని.. జనాలు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటు ఉంటారు. అవన్నీ విను.
వాళ్ళు ఏదీ కావాలంటే అది మాట్లాడుకోనివ్వు. కానీ దానిని మనస్సులో పెట్టుకోకు. వాటి గురించి ఆలోచించి బాధపడకు. నీవు చేస్తోన్న పనిలో అవమానం ఎక్కడుంది..? లేదు కదా. సాగిపో ముందుకు అంటూ ఎంకరేజ్ చేశారని, మా నాన్నే నా ధైర్యం అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ కు ఫుల్ డిమాండ్ – ఈ ఏజ్ వారిని బుక్ చేసుకుంటున్న మహిళలు