కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కు గెలుపుకు దోహదం చేసిన హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం హామీ ఒకటి. ఈ హామీని అక్కడి సర్కార్ ప్రారంభించింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ హామీ గురించి చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఈ పథకాన్ని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టగా… తాజాగా కేసీఆర్ కూడా ఈ పథకం గురించి సమాలోచనలు జరుపుతున్నారు.
కర్ణాటక ఫార్మూలను అనుసరించాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ గెలుపును ఈజీ చేసిన పలు పథకాలు తెలంగాణలోనూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం లాంచానమే. అయితే, ఈ పథకం కాంగ్రెస్ కు వరంగా మారి మహిళల ఓట్లను హస్తం వైపు మల్లిస్తుందని కేసీఆర్ హైరానా పడుతున్నారు. అందుకే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
రోజూవారీగా ఆర్టీసీ బస్సులో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు..? ఈ పథకం ప్రారంభిస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది..? అనే అంశాలపై ఆర్టీసీ ఉన్నతాదికారులను రిపోర్ట్ కోరినట్లు సమాచారం. అయితే, ఈ హామీ ఎలాగు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడుతుందని అంచనా వేసిన కేసీఆర్.. ఎన్నికల కంటే ముందుగానే ఈ పథకం ప్రారంభించి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు.
Also Read : రైతు బంధు రద్దు – కొత్త స్కీం అమలుకు కేసీఆర్ నిర్ణయం..?