కర్ణాటక ఎన్నికల వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేసి అనుకున్న ఫలితాన్ని రాబట్టాలని టి. కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఎవరైతే ఉన్నారో తెలంగాణలోనూ అతనే ఉన్నారు. అతడే సునీల్ కనుగోలు. అతని వ్యూహాలన్నీ కన్నడనాట సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. దాంతో అక్కడ అనుసరించిన ఎన్నికల పాలసీని తెలంగాణలో అనుసరించాలని అనుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఎస్కే టీం వర్క్ చేస్తోంది. అతనిచ్చిన సర్వే రిపోర్ట్ ల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేకంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సగం మంది అభ్యర్థుల ఎంపికను జూన్ చివరివరకు ఫిక్స్ చేయనున్నారు, ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అనేక సర్వేలు చేసి వడపోతలు చేసిన ఎస్కే.. మరో సర్వే చేసి అభ్యర్థుల లిస్టును రెడీ చేయనున్నారు. 55నుంచి 60నియోజకవర్గాల అభ్యర్థులను జూన్ లోపు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థులను ఖరారు చేస్తారు కానీ పేర్లను మాత్రం బయటకు రివీల్ చేయరు. ఖరారు అయిన అభ్యర్థులకు నియోజకవర్గంలో పని చేసుకోమని చెబుతారు. దాంతో ఎన్నికల నాటికీ అభ్యర్థి ప్రజల్లోనే ఎక్కువగా ఉండటం…అభ్యర్థుల విజయాన్ని ఈజీ చేశాయి. సర్వేలో గ్రాఫ్ తక్కువగా నేతలను వేరే నియోజకవర్గాలకు సర్దుబాటు చేస్తారు. కర్ణాటకలో ఇదే స్ట్రాటజీని అమలు చేసింది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి వ్యూహమే అనుసరించడం వలన మెరుగైన ఫలితం వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.