దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా బీజేపీ నేతలెవరూ స్పందించడం లేదు. అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. దేశానికి పతకాలు వస్తే అవన్నీ కేంద్రం అందిస్తున్నా సహకారంతోనే సాధ్యం అవుతున్నాయని చెప్పుకునే బీజేపీ నేతలు..ఇప్పుడు ఆ పతాకాలు సాధించిన క్రీడాకారులకు ఆపద వచ్చిందంటే మాత్రం మాట్లాడటం లేదు.
చాలామంది మహిళ రెజ్లర్ల తరుఫున మాట్లాడుతున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. ప్రధానికి కూడా ఈ విషయంలో చిక్కులు ఎదురు అవుతున్నా ఆయన మాత్రం మౌనముని పాత్రను వీడటం లేదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడే మోడీ… మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేతపై కనీసం ఓ మాట ఎందుకు మాట్లాడటం లేదనేది అందరి ప్రశ్న. బ్రిజ్‌భూషణ్ సింగ్ బీజేపీ ఎంపీ. యూపీ నేత. ఆయనపై చాలా కేసులు ఉన్నాయి.
ఆయనకు వందకు మించి విద్యా సంస్థలు ఉన్నాయి. బ్రిజ్‌భూషణ్ సింగ్ కు బలమున్న ప్రాంతాల్లో బీజేపీ కూడా బలీయంగా ఉంటుంది దానికి కారణం ఆయనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నేతలను కాపాడుకోవాలనేది బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచన. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని పక్కనపెడితే వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో యూపీలో కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.
అందుకే అంతమంది పేరుమోసిన మహిళ రెజ్లర్లు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నా ప్రధాని, బ్రిజ్‌భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవడంలేదు. చర్యలు కాదు కదా ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ప్రధాని మోడీ స్పందించాలని కోరుతున్నా ఆయన మాత్రం మెట్టు దిగడంలేదు.. అలాగే మహిళా రెజ్లర్లు కూడా తగ్గడంలేదు.