బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అన్యాయమైన నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేందుకు కాంగ్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభను నిర్వహిస్తోంది.
.ఈ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసింది. రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ అనౌన్స్ చేయగా.. యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. కేసీఆర్ హయంలో యువతకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత కోసం ఏమేం చేయనున్నారో ఈ డిక్లరేషన్ ద్వారా వెల్లడించనున్నారు.
నీళ్ళు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం… ఉద్యమ ఆకాంక్షలు స్వరాష్ట్రంలో నెరవేరలేదని యువత అసంతృప్తిగా ఉంది. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
టీఎస్ పీస్సీ కొన్ని పరీక్షలు నిర్వహించినా అవి పేపర్ లీక్ తో రద్దయ్యాయి. దీంతో బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ వరుసగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 8న యూత్ డిక్లరేషన్ సభను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో ఈ సభలో ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు.
యూత్ డిక్లరేషన్ లో ప్రధానంగా ఉండనున్న హామీలు ఇవేనా..?
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వనున్నారు.
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రం చత్తీస్ ఘడ్ లో నిరుద్యోగ భృతి ఇస్తుండటంతో తెలంగాణలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించనున్నారు.
- ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇవ్వనున్నారు.
- ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపడుతామని హామీ ఇవ్వనున్నారు.
- ప్రగతి భవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చుతామనే హామీ ఇచ్చే అవకాశం ఉంది.