కేసినో కింగ్ గా పేరొందిన చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఆయన అరెస్ట్ జరిగింది హైదరాబాద్ లో కాదు. థాయ్ లాండ్ లో. పట్టాయలో ఓ లగ్జరీ హోటల్ లో బుక్ చేసుకొని ఇండియా నుంచి 83మందిని తీసుకెళ్ళిన ప్రవీణ్ అక్కడ జూదం ఆడిస్తున్నాడు. ఈ విషయం అక్కడి పోలీసులకు తెలియడంతో దాడి హోటల్ పై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
పట్టాయలోని హోటల్ లో 83మందితో గ్యాంబ్లింగ్ ఆడుతోన్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలిసుల కళ్లుగప్పి కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయినట్లుగా అక్కడి వార్తపత్రిక కథనం ప్రచురించింది. ఇందుకు సంబందించిన ఫోటోలను ద నేషన్ థాయ్ లాండ్ పత్రిక విడుదల చేసింది. ఈ ఫోటోలలో ఉన్న వారంతా తెలుగురాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా ఉన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడిన ఫోటోల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు కూడా పట్టుబడినట్లు సమాచారం.
నిందితుల వద్ద భారీగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్దనుంచి గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వారిలో పన్నెండు మంది మహిళలు కూడా ఉండటంతో గ్యాంబ్లింగ్ కి మించి ఎదో జరుగుతోందన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
Also Read : వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ పై చికోటి ప్రవీణ్ పోటీ…!