ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన దగ్గర అంత ఉందని హెచ్చరించిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలకే టికెట్లు ఇస్తామని గురువారం జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. గతంలో సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు టోన్ చేంజ్ చేశారు. సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈసారి దాదాపు 30మంది సిట్టింగ్ లను మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించిన కేసీఆర్ వారికి వచ్చే ఎన్నికల్లో మొండి చేయి చూపనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ లో టికెట్ రాని వారి లిస్ట్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ అనుమానమే. మంచిర్యాల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్పలను పక్కనపెట్టనున్నారు. మిగతా కొందరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బాల్క సుమన్ కు కూడా కష్టమే.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
మెదక్ జిల్లా : నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యేను కూడా మార్చే అవకాశం ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన రోహిత్ రెడ్డికీ టికెట్ అనుమానమే. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు కూడా మొండిచేయే.
హైదరాబాద్ జిల్లా : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కష్టమే.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా : అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
ఉమ్మడి నల్గొండ జిల్లా : కోదాడలో మల్లయ్య యాదవ్ , తుంగతుర్తిలో గాదరి కిశోర్ ను మార్చొచ్చు.
ఉమ్మడి వరంగల్ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ,డోర్నకల్లో రెడ్యా నాయక్, జనగామలో యాదగిరి రెడ్డి.
ఖమ్మం : కాంగ్రెస్ నుంచి వచ్చిన పినపాక ఎమ్మెల్యే కాంతారావు, కొత్త గూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిలకు టికెట్ రాదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Also Read : ఆ 40 మంది సిట్టింగ్ లకు టికెట్ గల్లంతే – షాక్ ఇవ్వనున్న కేసీఆర్..!?