కాయగూరలు, మాంసం కూరలు, దుంపలు, పప్పు దినుసులలు మనిషికి బలాన్ని ఇస్తాయి. కానీ ఆకు కూరలు బలంతో పాటు ఆయువును కూడా పెంచుతాయి. ఆకులలో తమలపాకు రారాజు. దీనిని క్రమమ తప్పకుండా రోజు తీసుకుంటే మనిషి ఖచ్చితంగా వందేళ్ళు బతుకుతాడని ఆయర్వేద పండితులు ఐదు వేల ఏళ్ల కిందటే చెప్పారు.
అందుకే దీనిని ‘మృత సంజీవిని’ అని కూడా పిలుస్తారు. ఏ శుభకార్యం జరిగినా ముందుగా తమలపాకుతో తాంబూలం ఇస్తారు. అంటే ఏ కార్యం చేసినా పని చేసి అలసిపోతారు. అందుకే తాత్కాలిక శక్తి ఇవ్వాలని తాంబూలం ఇస్తారు. దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా ఇదే. చివరికి శవం నోట్లో కూడా తమలపాకును పెట్టి కర్మాకాండ జరిపిస్తారు. అంతటి విశిష్ట స్టానం తమలపాకుకు ఎందుకు ఉందో తెలుసుకుందాము.
ఒక సూపర్ మార్కెట్లో ఎన్నో రకాల వస్తువులు దొరికినట్లే తమలపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వ్యాధులు, డిజార్డర్లకు వీటిని చికిత్సలో ఉపయోగిస్తుంటారు. తక్కువ కొవ్వు, క్యాలరీలను కలిగి ఉండే తమలపాకుల్లో నీటి శాతం మెరుగ్గా ఉండటం వల్ల వేసవిలో ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. తమలపాకులతో చేసే పాన్లో కొబ్బరి, రాక్షుగర్, గుల్ఖండ్ వంటి పదార్ధాలు వాడటం వల్ల వేసవి ఎండ తాపాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు.
మండే ఎండలతో కొందరికి ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. తమలపాకులను తీసుకోవడం ద్వారా ఎండ వేడి ఎదుర్కొటూ వడదెబ్బ తగలకుండా కాపాతుంది. ముక్కు నుంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడవచ్చు. తమలపాకులతో చర్మ సంబంధ సమస్యలనూ నివారించవచ్చు. తమలపాకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
అయితే తమలపాకును కూరలాగా వండుకుంటే ఇందులోని ధాతువులు చచ్చిపోతాయి. అందుకే దీనిని ఉడికించరు. పచ్చి ఆకునే తినాలి. ఇందులో కాల్షియం శాతం పెంచే సున్నం, కాసు, వక్కలు, సొంపు, చెర్రి, పుదీనా కలిపి కిళ్ళి తింటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇందులో నీటి శాతం అధికం. చర్మ నిగారింపుని, రంగుని పాలిష్ చేస్తుంది. అందుకే ఆడవాళ్ళు భోజనం తర్వాత తప్పక కిళ్ళి వేసుకుంటారు.
ఇది చర్మ సమస్యల నివారణకు ఉపయోగ పడుతుంది. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. నొప్పి నివారణకు అమృతాంజన్ లా పని చేస్తుంది. అందకే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్న వృద్దులు రోజుకు పది సార్లు కిళ్ళి వేస్కుంటారు. దీనివలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రక్తం శుద్ధి చేస్తుంది. మనకు తెలియని చాలా మంచి పనులు చేస్తుంది.
ముఖ్యంగా నోటి పరిశుభ్రతను పెంచుతుంది. పిప్పి పన్ను రాకండా కాపాడుతుంది. పిప్పి పన్ను ఉన్నవాళ్ళు రోజు కిళ్ళి తింటే సరి. క్యాన్సర్ రోగాలు రాకుండా కాపాడుతుంది. మనిషి బరువును తగ్గిస్తుంది. కాబట్టి భోజనం తరువాత ఓ కిళ్ళి వేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆయువును పెంచుకోండి. ఒక కిళ్ళి ఓ గంట జీవిత కాలాన్ని పెంచుతుంది అంటారు.