ఈ రోజుల్లో వ్యవసాయం ‘దండగ’. కానీ తెలివిగా చేస్తే ‘పండగ’. రైతులను వేధించే అతి ప్రధాన సమస్య – పంటకు నీళ్ళు లేకపోవడం. చేతికి వచ్చిన పంట భారీ వర్షాలకు కొట్టుకు పోవడం. ఎరువులకు, క్రిమి సంహారక మందులకు డబ్బు లేకపోవడం. నానా తంటాలు పడి పంట పండించినా దానిని అమ్మకానికి వెళ్ళితే గిట్టుబాటు ధర రాకపోవడం. ఇది నేటి రైతు దుస్తితి.
ఈ సకల రోగాలకు ఒకే మందు అన్నట్లు, ఈ అన్ని సమస్యలకు ఒక్కటే పంట పరిష్కారం కలబంద (అలోవెరా) పంట. కలబందను కూడా పంటగా వేయవచ్చా అని ఆశ్చర్య పోకండి. పొలం గట్ల మీద, చెట్ల పొడలల్లో విరివిగా దొరికే కలబందకు పంటలుగా వేయవచ్చు. కలబంద (అలోవెరా)ను మనదేశంలో ఆయుర్వేద మందులల్లో విరివిగా వాడుతారు.
ఇక అందాన్ని పెంచే కాస్మోటిక్ క్రిములల్లో కలబంద తప్పనిసరిగా విరివిగా వాడుతారు. బేసిక్ ప్రోడక్ట్ గా వాడుతారు. దీని జిగురును ఆయిల్ గా తప్పక వాడతారు. ఇది చర్మం రంగును మెరుగు పరుస్తుంది. అంటి బాటిక్ క్రీం గా కూడా వాడతారు.
విదేశాల్లో కలబందకు విపరీతమైన డిమాండు ఉంది. ఎందుకంటే యూరప్ లాంటి చలి దేశాలల్లో ఇది పండదు. భూమధ్య రేఖలో ఎండ ఎక్కువగా ఉండే దేశాలల్లో విరివిగా పండుతుంది.
పంటకు నీళ్ళు చాలా తక్కువ కావాలి. ఎందుకంటే ఇది గాలిలోని తేమను పీల్చుకుని పెరుగుతుంది. ఎంత తక్కువ నిల్లుంటే అంత మంచిది. ఇక ఇది ఎంత భారి వర్షం వచ్చినా తట్టుకునే భారి ఆకులు ఉంటాయి. ఇక క్రిములు, కీటకాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల అవసరం రాదు. తక్కు నెలల్లో ఎక్కువ పంట పండుతుంది. ఎలాంటి నేలలోనైనా ఇది పండుతుంది.
అమ్మకానికి పెడితే గిట్టుబాటు ధర వస్తుంది. అంటే ఎకరానికి కేవలం లక్ష రూపాయల పెట్టుబడి పెడితే పది లక్షలు కళ్ళు మూసుకుని వస్తాయి. పైగా ఇది ఎక్కువకాలం పాడుకాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి. అదృష్టం చెప్పి రాదు – దురదృష్టం చెప్పి పోదు.