తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న వివేకా హత్య కేసులో ఈడీ ఎంటర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన నిందితులకు పెద్దమొత్తంలో డబ్బులు అందినట్లు తేలడంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దమొత్తంలో లంచం ఇచ్చి వివేకాను ఎందుకు హత్య చేయించారనేది ఈ కేసులో కీలకంగా మారింది. దాంతో ఈ కేసులో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈడీ ప్రవేశిస్తే సంచలన విషయాలు బయటపడనున్నాయి.
వివేకా హత్యకు రూ.40కోట్ల డీల్ జరిగిందనే విషయం బయటపడింది. దస్తగిరికి కోటి అందాయని చెబుతున్నారు. సునీల్ యాదవ్ కూడా కోటి ఇచ్చారు. ఇతర నిందితులకు భారీగానే ముట్టిఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి. అయితే…నిందితులకు డబ్బులు ఎవరి వద్ద నుంచి అందాయి.? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? అనేది సీబీఐ విచారణలో కొంతమేరకు తేల్చింది. ఈ కేసులో మనిలాండరింగ్ జరిగినట్లుగా ఈడీకి సీబీఐ వివరాలు ఇచ్చి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలనుకుంటుంది. అందులో భాగంగా ఈడీని కూడా రంగంలోకి దింపి కేసు పూర్వాపరాలు తేల్చే పనిలో పడినట్లుగా చెబుతున్నారు. ఈడీ విచారణ ప్రారంభిస్తే అసలు వివేకా హత్య కోసం డబ్బులు ఎవరు ఇచ్చారు..? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..? అనేది తెల్చితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరో క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఈ కేసును ఈడీ అంతర్గతంగా పరిశీలిస్తోందని అంటున్నారు.
Also Read : వివేకాకు మరో అక్రమ సంబంధం అంటగట్టిన అవినాష్ రెడ్డి..!