ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడే యోచనతోనే ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. వీరిద్దరూ ఏ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాలు ఆసక్తిగా తిలకిస్తుండగా… మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్ లో ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీని వీడెందుకు సిద్దం కాగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. వీరిద్దరూ గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్నారు.
జోగు రామన్న, పట్నం మహేందర్ రెడ్డిలు గత ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రులుగా పని చేసిన వారే. 2018ఎన్నికల్లో జోగు రామన్న మరొసారి గెలుపొందగా.. పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తరువాత జోగు రామన్నతోపాటు పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పూర్తిగా పక్కనపెట్టేసింది. జోగు రామన్నను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆ మధ్య వార్తలు వచ్చినా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పట్నంను మంత్రివర్గంలోకి తీసుకోకపోగా పార్టీ కార్యక్రమాలకే ఆయన్ను దూరంగా పెడుతున్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూర్ లో ప్రాధాన్యత ఇస్తుండటం పట్నం మహేందర్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు. పైగా.. తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అని పైలెట్ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేటీఆర్ అండదండలు ఉండటంతో పైలెట్ టికెట్ కు ఏ డోఖా లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదని భావించే పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
జోగు రామన్నకు టికెట్ పై ఏ చికు , చింతా లేకపోయినా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయింపులు సరిగా లేకపోవడం…ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారు జోగు రామన్న. పైగా జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమాత్రం ఆశాజనకంగా లేదని భావిస్తోన్న ఆయన… వచ్చే ఎన్నికల్లోఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు చావు దెబ్బ తప్పదని అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీ మారేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. జోగు రామన్న అసంతృప్తిని గ్రహించిన కాంగ్రెస్ , బీజేపీలు ఆయన్ను చేర్చుకునేందుకు గాలం వేస్తున్నాయి.
బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్న జోగు రామన్నతోపాటు పట్నం మహేందర్ రెడ్డిలను శాతింపజేసేందుకు బీఆర్ఎస్ చీఫ్ ఒకరిద్దరిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు.
Also Read : రంగంలోకి రాహుల్ టీమ్ – పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారా..?