“వైదేహి పరిణయం” అనే సీరియల్ లో కరుణ భూషణ్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ సీరియల్ విశేష ఆదరణ పొందటంతోపాటు కరుణ భూషణ్ కు పాపులారిటీ మరింత పెరిగింది. ఆమె నటనకు ప్రశంసలు వస్తుండటంతో మరిన్ని సీరియల్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలోనే కరుణ భూషణ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతోపాటు తన కుమారుడు తన పట్ల చేసే కామెంట్స్ ను వెల్లడించింది. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ కుమారుడిని ఎలా పెంచాలో తెలియదా..? అంటూ కరుణ భూషణ్ ను టార్గెట్ చేస్తున్నారు.
ఇంతకీ ఆమె ఎం చెప్పిందంటే… తన కుమారుడు తాను ఫ్రెండ్స్ గా ఉంటామని వెల్లడించింది. అంతే కాకుండా తన గ్లామర్ గురించి నా కొడుకు కాంప్లిమెంట్స్ ఇస్తుంటాడని వెల్లడించింది. తన ధరించే డ్రెస్ బాగోలేకపోతే నిర్మొహమాటంగా బాగోలేదని చెప్పేస్తుంటాడని.. తను ముక్కుసూటి మనిషి అని కుమారుడి గురించి చెప్పుకొచ్చింది.
ఇది బాగానే ఉన్నా.. తను ఎప్పుడైనా కాస్త హాట్ డ్రెస్ వేసుకుంటే సెక్సీగా ఉన్నావని చెప్తుంటాడని కరుణ భూషణ్ తెలిపింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉండేలా ఏం జరిగినా తనతో షేర్ చేసుకోవాలని తనే చెప్పినట్లు కరుణ భూషణ్ తెలిపింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కరుణ భూషణ్ ను నెటిజన్లు ఎకిపారేస్తున్నారు.