కేసీఆర్ చేస్తోన్న రాజకీయలపైనే ఈ వారం కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఆయన ప్రజలను అమాయకులుగా భావిస్తూ రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలు బిడ్ వేయడం సాధ్యం కాదని తెలిసి కూడా బీఆర్ఎస్ బిడ్ లో పాల్గొంటుందని చెప్పడమే. ఈ అంశంతో ఏపీలో బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం కలగడంతోపాటు ఉత్తరాంధ్రలో 25సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఊహలో తెలియాడుతున్నారట. ఆంధ్ర ప్రజలు ఒట్టి అమాయకులనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఆర్కే చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర ప్రజలే మరిచిపోయిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడుతుందని..దేశంలో గులాబీ గుబాళింపు తప్పనిసరిగా జరుగుతుందని..అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నేనని కేసీఆర్ ఓవర్ థింక్ చేస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలపై కన్నేసిన కేసీఆర్ తెలంగాణను మరిచిపోతున్నారని ఇదే కొనసాగితే ఆయన దారుణ పరాభవం చవిచూడటం ఖాయమని విశ్లేషించారు ఆర్కే.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని…జాతీయ రాజకీయాల హడావిడిలో పడి తెలంగాణలో ఓటమి పాలైతే కేసీఆర్ తన రాజకీయ వైభవాన్నితానే అపహాస్యం చేసుకున్నట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. అందుకే ఇతర రాష్ట్రాల రాజకీయ సమస్యల్లో తలదూర్చడం మాని కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్ ను ఇచ్చిన తెలంగాణపై ఫోకస్ చేయాలనీ సూచించారు. లేదంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాదు కదా ప్రాంతీయ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేకుండా పోతుందని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ ప్రజలను బుర్ర లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ ప్రజలకే బుర్ర లేదని కేసీఆర్ నిరూపించారని.. స్టీల్ ప్లాంట్ అంశంలో ఈ విషయాన్నీ నిరూపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని విజయోత్సవ సంబరాలకు రెడీ అయిన బీఆర్ఎస్ కు కేంద్రం షాక్ ఇచ్చిందని…ఇప్పుడు ఆ క్రెడిట్ ను ఎవరు సొంతం చేసుకుంటారని ప్రశ్నించారు.
ప్రతివారం జగన్ రాజకీయాలపై విశ్లేషణ చేసే ఆర్కే ఇటీవల కేసీఆర్ రాజకీయాలపై ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు.ఈ వారం కూడా జగన్ ను సెటైరికల్ గా వాయించేశారు. వివేకా హత్య కేసు గురించి పేర్కొంటూ సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించినందుకే వివేకా హత్య అంటూ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పిన కథ ఎర్రమందారం సినిమాలోదని.. ఎన్నికలు వచ్చేసరికి ఎన్ని కథలు అల్లుతారో అంటూ పేర్కొన్నారు ఆర్కే.
Also Read : సంచలన కథనం : కేసీఆర్ అక్రమాల చిట్టాను బయటపెట్టిన ఏబీఎన్ ఆర్కే