ఏపీ రాజకీయాల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరిస్తోన్న జనసేన కుటుంబ వారసత్వ పార్టీగా మారుతుందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు జనసేన పార్టీలో కీలక పదవి అప్పగించడమే ఈ విమర్శలకు కారణం.
తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని నాగబాబుకు కట్టబెట్టారు పవన్. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచే పవన్ కు తోడుగా ఉంటూ వస్తోన్న నాగబాబుకు కీలక పదవి దక్కిందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏ పార్టీలోనైనా అద్యక్షుడి తరువాత ప్రధాన కార్యదర్శిదే అప్పర్ హ్యాండ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరువాత జనసేనలో నాగబాబుదే కీరోల్ అని చెప్పొచ్చు. దీనిని ఆధారం చేసుకొని జనసేనను కుటుంబ వారసత్వ పార్టీ అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇన్నాళ్ళు పార్టీలో నెంబర్ 2గా ఉండిన నాదెండ్ల మనోహర్ కు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించకుండా కేవలం పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ గా కొనసాగిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. పీఆర్పీలోనూ కొణిదెల ఫ్యామిలీదే పెత్తనం ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన జనసేనలోనూ అదే సీన్ కనిపిస్తోందని పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు. మొత్తానికి పవన్ పార్టీలో తన ఫ్యామిలీకే మోస్ట్ ప్రియార్టి అనిపించుకున్నారంటూ మండిపడుతున్నారు. ఈ విమర్శలను జనసేన నేతలు ఖండిస్తున్నారు.
జనసేన పార్టీలోనున్న కీలక నేతలు ముగ్గురే. పవన్ , నాదెండ్ల మనోహర్ , నాగబాబు…ఈ ముగ్గురే పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. పవన్ బిజీ షెడ్యూల్ వలన పీఏసీ చైర్మన్ గా కొనసాగుతున్న మనోహార్ ఒక్కడే పార్టీ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికీ షూటింగ్ లను కంప్లీట్ చేసుకొని ఎన్నికల కదనరంగంలోకి వెళ్లనున్నారు. ఆలోపు పార్టీ కార్యక్రమాలను సమన్వయము చేసుకునేందుకే నాగబాబుకు జనరల్ సెక్రటరీ పదవిని అప్పగించారని జనసేన నేతలు క్లారిటీ ఇస్తున్నారు.
									 
					