కరోనా ( Corona ) మహమ్మారి మళ్ళీ బుసలు కొడుతోంది. మానవాళిని కబళించేందుకు చాపకిందనీరులా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ ( Covid ) కేసులు ఇటీవల పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి ( Posani KrishnaMurali ) కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి.
కరోనా బారిన పడిన పోసాని ( Posani ) ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం పూణే ( Pune) వెళ్ళిన పోసాని( Posani )కి అక్కడే కోవిడ్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. పూణే( Pune) నుంచి తిరిగి రాగానే పోసానిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది.
టాలీవుడ్ విలక్షణ నటుడిగా , దర్శకుడిగా పోసానికి మంచి పేరుంది. అటు వైసీపీ(Ycp) లో కొనసాగుతున్నారు పోసాని. జగన్ కు సన్నిహిత నేతగా ఆయనకు పేరుంది. గతంలో పోసానికి కరోనా సోకిన సమయంలో ఆయన చికిత్స పొందే ఆసుపత్రికి జగన్ భార్య భారతిరెడ్డి ( Ys Bharathi Reddy ) ఫోన్ చేసి.. పోసాని( Posani )కి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోసాని చెప్పిన సంగతి తెలిసిందే.
తనకు చిత్రపరిశ్రమలో చాలానే పరిచయాలు ఉన్నా కరోనా సోకినా సమయంలో ఎవరూ తనను పరామర్శించలేదన్నారు పోసాని. కాని జగన్ ( Jagan ) మాత్రం తనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించినట్లుగా చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తాను జీవితాంతం జగన్ కు నమ్మిన బంటుగా ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోనూ యాక్టివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణ( Telangana) లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 45 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ లోనే 18 వెలుగుచూశాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.