కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన వెనక గుట్టును రేవంత్ రెడ్డి వరుసగా బయటపెడుతున్నారు. కేసీఆర్ , కేటీఆర్ మరో ఏడుగురు ఐఏఎస్ లు ఓ ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అక్రమాలకు పాల్పడటమే కాకుండా ఇతరులు నిర్మాణాల అనుమతుల కోసం సంప్రదిస్తే 20శాతం భూమిని లంచంగా ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా ప్రతి దాంట్లో దోపిడీకి పాల్పడుతుండటంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్థాయికి చేరుకున్నారని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి వరుసగా పెడుతోన్న ప్రెస్ మీట్లు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. వరుసగా మూడు రోజులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి భూబాగోతాలను బయటపెట్టిన రేవంత్ పక్కా ఆధారాలతో మీడియాకు ముందుకు వస్తున్నారు. ఎదో గాలి మాటలు అసలే మాట్లాడటం లేదు. రేవంత్ చేస్తున్నవి రాజకీయ ఆరోపణలు అనుకోవడానికి వీలు లేకుండా సర్కార్ ఇచ్చిన డాక్యుమెంట్లు, అందులో జరిగిన అవినీతిని బయటపెడుతుండం సంచలనంగా మారింది. మొత్తంగా ఈ వ్యవహారం రానున్న రోజుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు బిగుసుకునే అవకాశం ఉంది.
తాజాగా హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పక్కనే నిర్మిస్తున్న ఓ 21 అంతస్తుల భవనం గురించి తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. అక్కడ నమస్తే తెలంగాణ కార్యాలయం కడుతున్నారని ఆరేడేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్థలం కేసీఆర్ చేతికి ఎలా వచ్చిందో వివరిస్తూ రేవంత్ పూసగుచ్చినట్లు వివరించారు. కుర్రా శ్రీనివాస రావు అనే వ్యక్తి కొన్న స్థలంలో నిర్మాణాల అనుమతుల కోసం వెళ్తే కొంత భూమిని డిమాండ్ చేశారని ఆరోపించారు రేవంత్. ఇరవై శాతం భూమిని తీసుకొని గ్రీన్ జోన్ లోనున్న బిల్డింగ్ ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
కేబీఆర్ పార్క్ చుట్టు ఐదు అంతస్తుల నిర్మాణం కన్నా ఎక్కువ అనుమతులు ఇవ్వరు. కానీ అక్కడ 21అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని… ఆ పత్రాలను బయటపెట్టారు రేవంత్. నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇచ్చారంటే కేసీఆర్ ఫ్యామిలీకి ముట్టాల్సిన భూమి ముట్టింది కనుకే ఈ పర్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికే మూడు అంతస్తులకు మించి అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. 20శాతం భూమిని కేసీఆర్ కు రాసియ్యడంతోనే 21అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి మున్సిపల్ శాఖ అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం వంటి వాటి ద్వారా కేసీఆర్ వేల కోట్లు వెనకేశారని చెప్పుకొచ్చారు. వాటన్నింటిని ఆధారలాతో సహా రేవంత్ బయట పెడుతున్నారు.ఇవన్నీ ముందు ముందు సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.