కోడికత్తి కేసు కీలక దశకు చేరుకున్న వేళ జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ చూసి న్యాయవర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటని నివ్వెరపోతున్నారు. ఈ కేసు విషయంలో స్పష్టత రావాలనుకుంటున్నారా..? విచారణ మరింత ఆలస్యం కావాలని కోరుకుంటున్నారా..? అని జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు.
అసలు లోతుగా విచారణ అంటే ఏమిటన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జగన్ ఒత్తిడి మేరకు కోడికత్తి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. విచారణ చేపట్టిన ఎన్ఐఏ కీలక విషయాలను వెల్లడించింది. సరిగ్గా విచారణ కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జగన్ ట్విస్ట్ ఇచ్చారు.
ఈ కేసును డీల్ చేస్తోన్న ఎన్ఐఏ విచారణపై నమ్మకం లేదన్నట్లుగా ఆయన మరింత లోతైన విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా కనబడుతోంది. జగన్ వైఖరి చూస్తుంటే కోడికత్తి కేసు విచారణ పూర్తి కావొద్దనే విధంగా ఉంది. ఎందుకంటే ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో అసలు విషయం బయటకొస్తుందని ఆందోళన చెందుతున్నట్టున్నారు.
జగన్ ఈ కేసును ఎలా ఉపయోగించుకున్నారో.. విచారణ సవ్యంగా జరగాలనుకుంటున్నారో లేదో కాని కోడికత్తి శీను మాత్రం నాలుగేళ్ళుగా జైలు గోడలకే పరిమితమయ్యాడు. ఆయన తల్లిదండ్రులు శీను ఎప్పుడు వస్తాడా..? అని వెయిట్ చేస్తున్నారు. దారుణ హత్యకు పాల్పడిన ఎమ్మెల్సీకు బెయిల్ వచ్చింది కానీ కోడికత్తి శీనుకు మాత్రం ఇంకా బెయిల్ రాలేదు.
ఎన్ఐఏ చేసిన విచారణతో గత ఎన్నికలకు ముందు తాము చేసిన డ్రామాలు బయటపడుతాయనే జగన్ విచారణ ఆలస్యం కావాలని తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసినట్టుగా కనిపిస్తోంది.
Also Read : వైసీపీలో కలకలం రేపుతోన్న ఆదోని ఎమ్మెల్యే వ్యాఖ్యలు