ప్రతిపక్ష కూటమికి తనను చైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చును తానే పెట్టుకుంటానని బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే…బీజేపీయేతర పార్టీలకన్నింటికి ఎన్నికల ఖర్చు చేసేంత డబ్బు కేసీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఈ సీక్రెట్ ను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో బయటపెట్టారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూదందా చేసి కేసీఆర్ కోట్లను గడించారని ఆర్కే పేర్కోన్నాడు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి…అవి తమవేనని ఎవరైనా కోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుంటే… వాటిని ప్రభుత్వం తరుఫున కనీసం సవాల్ చేయకుండా నిస్సహాయంగా ఉంటున్నారని.. అలా ప్రైవేట్ పరం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆర్కే చెప్పుకొచ్చారు.
కేసిఆర్ రియల్ స్టేట్ బిజినెస్ ను అడ్డుపెట్టుకొని సంపాదించడంతోనే జాతీయ స్థాయిలో పార్టీలకు ఎన్నికల ఖర్చు చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని ..మొత్తంగా తెలంగాణను లూటీ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా గురించి చెబితే వారం రోజుల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ భూదందాల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని ఆర్కే తన ఆర్టికల్ లో ప్రస్తావించారు. కానీ ఈ సమాచారాన్ని ఆయన బయటపెడుతారో లేదో రానున్న రోజుల్లో తేలనుంది.
అయితే కేసీఆర్ ఆఫర్లకు జాతీయ స్థాయి పార్టీలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు ఆర్కే. ఆర్ధికపరమైన సాయం చేస్తామంటే తీసుకునేందుకు రెడీగా ఉన్నారు కానీ కేసీఆర్ ను ప్రతిపక్ష కూటమి చైర్మన్ గా నియమించి ఆయనతో కలిసి నడించేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడంలేదు.
గతంలో కేసీఆర్ రాజకీయాలపై వార్త విశ్లేషణలు చేస్తే ఆంధ్రజ్యోతి ఛానెల్ ను బ్యాన్ చేశారు. పత్రికకు యాడ్స్ ఆపేశారు. ఇప్పుడు అలాంటి ఆరోపణలు చేయడంతో ఆర్కేపై కేసీఆర్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో చూడాలి.