టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటిసులు పంపిన కేటీఆర్ కు రేవంత్ ఊహించని విధంగా రిప్లై ఇచ్చారు. తనకు పంపిన నోటిసులు వాపస్ తీసుకోకపోతే తానే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కేటీఆర్ కు రిటర్న్ ఝలక్ ఇచ్చారు. తాను నిరుద్యోగుల తరుఫున కేటీఆర్ పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానని తెలిపారు. టీఎస్ పీస్సీకి సాంకేతికంగా మొత్తం ఐటీ శాఖనే సపోర్ట్ చేస్తుంది కాబట్టి…పేపర్ లీక్ తో ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కు సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
పేపర్ లీక్ వ్యవహారంపై నిష్పాక్షపాతమైన విచారణ జరగాలని సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని గుర్తు చేశారు రేవంత్. తెలంగాణ ఉద్యమమే నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైందని గుర్తు చేసిన రేవంత్…అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కేటీఆర్ కు ఈ విషయం తెలియదని మండిపడ్డారు. విదేశాల్లో గడిపిన కేటీఆర్ కు నిరుద్యోగుల వెతలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.తనకు ఇచ్చిన నోటీసులను వాపస్ తీసుకోకపోతే తానే నీపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కేటీఆర్ కు రేవంత్ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
పేపర్ లీక్ వ్యవహారంతో కేటీఆర్ ప్రమేయం ఉందని..ఆయన కనుసన్నలో కేటీఆర్ పీఏ పేపర్ లీక్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేటీఆర్ పీఏ సొంత మండలంమాల్యాలలో చాలామందికి గ్రూప్ 1ఎగ్జామ్ లో వందకు పైగా మార్కులు వచ్చాయని దీని వెనక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. రేవంత్ చేసిన ఈ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటిసులు ఇచ్చింది. ఆ తరువాత రేవంత్ సిట్ ఎదుట హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చారు కానీ కేటీఆర్ కు మాత్రం ఎలాంటి నోటిసులు జారీ చేయలేదు.
అయితే , రేవంత్ చేస్తోన్న ఆరోపణలతో తన పరువుకు భంగం కల్గుతుందని ఆయనపై పరువు నష్టం దావా వేస్తున్నానని కేటీఆర్ నోటిసులు పంపగా..రేవంత్ మాత్రం రిటర్న్ తానే కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఈ వివాదం పెను సంచలనంగా మారుతోంది.