సోషల్ మీడియాను గత కొంతకాలంగా ఊపేస్తోన్న వార్త నిహారిక కొణిదెల విడాకుల ఇష్యూనే. చైతన్య జొన్నలగడ్డ కుటుంబం విధిస్తోన్న అంక్షలతో విసిగిన నిహారిక అతనితో విడిపోయేందుకు సిద్దమైందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల పంచాయితీ కాస్త మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిహారిక, చైతన్యలు కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా నిహారిక కుదరదని చెప్పడంతో వారిద్దరిని తీసుకొని నాగబాబు , చిరంజీవి వద్దకు ఈ పంచాయితీని తీసుకెళ్లాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఎందుకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నావని నిహారికను చిరంజీవి ప్రశ్నించగా… ప్రతి విషయంలో తన అత్తా, మామల ఆంక్షలను భరించలేకపోతున్నానని చెప్పిందట. దాంతో తమ మధ్య తరుచు గొడవలు అవుతున్నాయని అందుకే చైతన్యతో కలిసి ఉండలేనని చెప్పగా చిరంజీవి జోక్యం చేసుకొని వాళ్ళిద్దరితో మాట్లాడి కంప్రమైజ్ చేశాడని అంటున్నారు.
చిరంజీవి దగ్గరకు ఈ విడాకుల పంచాయితీ చేరడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఎండ్ కార్డు పడినట్టేనని మెగా అభిమానులు అంటున్నారు. అయితే.. షరతుల మీద ఇద్దరు ఒకటి కావడంతో మరెప్పుడైనా ఈ వివాదం మళ్ళీ తెరపైకి వస్తుందా..? అనే అనుమానాలు కూడా కల్గుతున్నాయి. ఏదీ ఏమైనా నిహారిక, చైతన్యలు కలిసిపోవడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపడంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల్లోకి పెద్ద హీరోయిన్ అవుదామనే కోరికతో నిహారిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. అప్పటి నుండి ఈమె నటనకి గుడ్ బై చెప్పేసి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను నిర్మిస్తుంది. ఇది కూడా చైతన్య కి ఇష్టం లేదని, వీళ్లిద్దరికీ మధ్య విభేదాలు రావడానికి అది కూడా ఓ కారణం అయ్యింది అంటున్నారు.
Also Read : నీహారిక – చైతన్య విడాకుల న్యూస్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా..?