పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసేందుకు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చర్యలు ఉంటాయని పరేడ్ గ్రౌండ్ సభ నుంచి ప్రగతి భవన్ కు హెచ్చరికలు పంపారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలా..? వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని రెండు ఒకే తాను ముక్కలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్న తాము ఉపేక్షించబోమని పరోక్షంగా బీఅర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు.
తెలంగాణకు కేంద్రం దండిగా అండదండలు కల్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక సకాలంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటున్నాయని రాష్ట్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రజలకు నష్టం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రతి ప్రాజెక్టులో తమ స్వార్ధాన్ని చూసుకుంటున్నారని.. కమిషన్లను దండుకుంటున్నారని పరోక్షంగా కాళేశ్వరంపై వస్తోన్న ఆరోపణలు మోడీ వినిపించారు. తెలంగాణ కొందరి చేతిలో బందీగా ఉందంటూ కేసీఆర్ కుటుంబాన్ని ఎత్తిచూపారు. ఈ పాలన నుంచి విముక్తి కలగలన్నారు.
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో పాల్గొన్న మోడీ… సోదరి సోదరిమణులకు అంటూ తెలుగులో స్పీచ్ ను స్టార్ట్ చేశారు మోడీ. బీజేపీని రాష్ట్రంలోనూ ఆశీర్వదిస్తే రాష్ట్రాన్నికి అవినీతిరహిత పాలన అందిస్తామని ప్రధాని మోడీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ రైలును ప్రారంభించామన్న ప్రధాని.. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామన్న మోడీ తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు.