ఈరోజు ప్రధాన మంత్రి మోడీ నరగానికి వస్తున్న సంధర్బంగా మొత్తం నగరం కాషాయం రంగుతో నిండిపోయింది. మోడీ దృష్టిలో పడాలని బిజెపి నేతలు ఎవరికీ వారుగా పోటిపడి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ నగరం నిండా పెట్టారు. మొత్తం కాషాయం మాయం చేశారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే రోడ్ల మీద బిజెపి నాయకులు పోటిపడి బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్స్ లు, కట్ అవుట్ పెడితే పర్వాలేదు.
కానీ మోడీ రాని పాత బస్తీలో, నగరం నలుమూలలా కాషాయం రంగు రేపరెపలాడుతోంది. ఎందుకు? అంటే ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశించే బిజెపి కార్పొరేటర్లు, ‘బి’ గ్రేడ్ నాయకులు అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తమ సత్తా ఏమిటో అధిష్టానానికి చూపి పార్టీ టికెట్ సంపాదించుకోవాలని వీడియోలు, ఫోటోలు తీసి దాచుకుంటున్నారు. వీళ్ళు టికెట్ ఆశించే ఆశబాహులు.
దీనికి అయ్యిన ఖర్చు దాదాపు రూ 13 కోట్లు అని తెలుస్తోంది. అయితే చిన్నా చితక నాయకుల విషయం పక్కనపెద్తే ఇప్పుడు లీడింగ్ లో ఉన్న బిజెపి బడా నాయకుల ఖర్చులను మాత్రం మొత్తం రైల్వే శాఖ అకౌంట్ లో పడింది అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి బండి సంజయ్, లక్షణ్ లాంటి నాయకు సహాయ సహకారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ సొమ్ము ప్రజలది కాదా? దీనిని ఇంతగా ధారాదత్తం చేసే హాక్కు బిజెపి కి ఎవరు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి.
నగరానికి వస్తున్న మోడీ ప్రచార ఖర్చు ఎంతో తెలుసా?