నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి తలకిందులు అవుతోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని కల్పించుకుంది. జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే పార్టీ మారతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం… ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో వారంతా జగన్ కు వ్యతిరేకంగా మారారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రాంనారాయణరెడ్డిలు తిరుగుబాటు తరువాత నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత దీనంగా మారింది.
జగన్ కు వీరవిధేయుడిగానున్న అనిల్ కుమార్ యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ జగన్ తో తనకున్న సాన్నిహిత్యంతో టికెట్ పొందగలనే ఆశతో ఉన్నారు అనిల్ కుమార్. అయితే అనిల్ ను కాదని మరొకరికి అవకాశం కల్పించాలనుకున్న బలమైన నేతలు వైసీపీకి దొరకడం లేదు. కోటంరెడ్డి, ఆనంలను విమర్శించి జగన్ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్న అనిల్ ను జగన్ కరుణిస్తారా..? అని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. నెల్లూరు రూరల్‌కు అదాలను అభ్యర్థిగా ప్రకటించేశారు. కానీ ఆయన మాత్రం వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అసలు ఆయన పార్టీలో ఉంటారా లేదా అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆయన స్థానంలో కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారని చెబుతున్నారు. కానీ మొత్తం మేకపాటి కుటుంబమే వైసీపీని వీడుతుందనే ప్రచారం చాలా ఉధృతంగా సాగుతోంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా చంద్రబాబును కలిశారని తెలియడంతో ఆయనను కూడా వైసీపీ నమ్మే పరిస్థితి లేదు. కావలి ఎమ్మెల్యే భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇలా వరుసగా నెల్లూరు అస్తవ్యస్థం కావడం వైసీపీ నాయకుల్ని కూడా విస్మయ పరుస్తోంది.
Also Read : వైసీపీకి మైండ్ బ్లాక్ చేస్తోన్న టీడీపీ – అసలు కథ ఏంటంటే..?