మంచు ఫ్యామిలీలో అందరికీ కాస్త వెటకారం ఎక్కువే. అడిగిన ప్రశ్నలకు సందర్భానుసారం సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానాలు చెప్పి ట్రోలింగ్ కు గురి అవుతారు. ఇటీవలి సంఘటనలతో ఈ ట్రోలింగ్ పెరుగుతున్నా మంచు వారి కుటుంబ సభ్యులు మారడం లేదు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతున్నారు.
మనోజ్, విష్ణు ల మధ్య గొడవలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. దీనిని కవర్ చేసుకోవడానికి విష్ణు రిలీజ్ చేసిన ‘హౌస్ అఫ్ మంచుస్’ కూడా ఫేక్ అని మంచు లక్ష్మి, మంచు మనోజ్ లు చెప్పిన సమాధానంతో తేలిపోయింది. మనోజ్ పై దాడి చేసిన ఘటనను కవర్ చేసుకునేందుకు యత్నించి విష్ణు దొరికిపోయారు.
తాజాగా మోహన్ బాబు ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా విష్ణు – మనోజ్ ల మధ్య గొడవ గురించి అడగ్గా…ఆయన చెప్పిన సమాధానం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ‘’మీ ఇంట్లో నీకు నీ భార్యకు సంబంధం ఏమిటో చెప్పగలవా ?’’ అని మళ్ళీ రివర్స్ లో ఎవరికీ అర్ధం కానీ ఓ ప్రశ్న వేశారు. గొడవ గురించి ప్రశ్నిస్తే అందుకు సంబంధించిన సమాధానం చెప్పాలి. లేదంటే ఇది సందర్భం కాదని చెప్పాలి. అంతేకాని రివర్స్ లో మొరటు వ్యాఖ్య చేయడం ఏంటో మోహన్ బాబుకే తెలియాలి.
ఇటీవల జరిగిన సంఘటనలతో మనోజ్ కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత అవగాహనాతో వ్యవహరించాలి. మాట్లాడాలి. కాని సహనం కోల్పోయి మాట్లాడాడు. ఇటీవలి సంఘటనల మీద స్పష్టత ఇస్తారా..? అనే ప్రశ్నకు ‘ రీసెంట్ గా సెగ్గడ్డ వచ్చింది ‘ అని కౌంటర్ వేసింది చాలక వీపు చూపించారు. ఆయన దృష్టిలో ఇది గొప్ప సెటైర్ కావొచ్చు కాని ఆయన చేసిన ఈ కామెంట్స్ , వీపు చూపడాలు మరింత చులకన అయిపోతున్నాడనే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం లేదు.
మోహన్ బాబు, విష్ణు,లక్ష్మీతో పోల్చుకుంటే మనోజ్ పై ట్రోలింగ్ చాలా తక్కువ. ఇలాంటి కామెంట్లు చేస్తే.. మనోజ్ కూడా అనవసరమైన ట్రోలింగ్ కి గురి కావాల్సి వస్తుంది. ఇలాంటి కామెంట్స్ చేసి మంచు వారు తమ ఫ్యామిలీ ప్రతిష్టను నవ్వులపాలు చేసుకునే అవకాశం ఉంది.
Also Read : మంచు విష్ణు డ్రామా -మరోసారి షాక్ ఇచ్చిన మనోజ్